అన్‌స్టాపబుల్ 2..రెండో ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా?

110
season 2
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. ఇక…రెండో సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు బాలయ్య బావ టీడీపీ అధినేత నారా లోకేష్, అల్లుడు నారా లోకేష్. అన్‌స్టాపబుల్ సీజన్ 1 రికార్డులను బ్రేక్ చేస్తూ అత్యధిక వ్యూస్ రాబట్టింది.

ఈ నేపథ్యంలో రెండో ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో షోకి సెకండ్ గెస్ట్ ఎవరో అంచనా వేయాలని హింట్ ఇస్తూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది ఆహా టీం.ఒక రెండు పజిల్స్ ఇచ్చి సెకండ్ ఎపిసోడ్ కి ఎవరు రానున్నారో కనిపెట్టండి అంటూ ప్రేక్షకులకి సవాలు విసిరింది.

ఆహా టీం ఇచ్చిన పజిల్స్ ప్రకారం రెండో ఎపిసోడ్ కి హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహాశెట్టి , హీరో విశ్వక్ సేన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -