YSRCP:చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!

6
- Advertisement -

తిరుమల అంశాన్ని రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఇప్పటికే నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) స్పష్టమైన నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ కొత్త కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

NDDB నివేదికలో జంతు కొవ్వు లేదని తేలినప్పటికీ, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తోందని అమర్నాథ్ ఆరోపించారు. జంతు కొవ్వు ఉందని చెప్పే నివేదిక వచ్చే వరకు కమిటీల మీద కమిటీలు వేస్తూనే ఉంటారా అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది తిరుమల పవిత్రతపై అనవసర అనుమానాలు రేకెత్తించే ప్రయత్నమని ఆయన మండిపడ్డారు.

తిరుమల అంశం కోట్లాది హిందువుల విశ్వాసంతో ముడిపడి ఉందని, అలాంటి సున్నితమైన విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం దురదృష్టకరమని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లాభాల కోసం తిరుమల పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.

Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

తిరుమల అంశంపై రాజకీయాలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.

- Advertisement -