సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవారు బెడ్ కాఫీ తాగనిదే ఏ పని కూడా ప్రారంభించరు. ఇక ఆ తరువాత రోజులో కనీసం మూడు నుంచి ఐదు సార్లు టీ లేదా కాఫీ తాగుతూనే ఉంటారు. టీలో గాని కాఫీలో గాని చాలానే రకాలు ఉన్నాయి, మసాలా టీ, ఇరానీ టీ, గ్రీన్ టీ, లెమెన్ టీ.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా జామ టీ తాగారా ? ఒకవేళ తాగకపోతే దాని ఉపయోగాలు తెలిస్తే అసలు తాగకుండా ఉండరు. జామ ఆకులను ఆకులను నీటిలో మరిగించి అందులో తేనె లేదా పటిక బెల్లం వేసి.. జామ టీ ని తయారు చేస్తారు. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. .
ఈ టీ ప్రతి రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులలో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ, ఇ, బి12, బి6.. వంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలి ఫెనాల్స్.. ఇలా అన్ని రకాల సమ్మేళనలు మిళితం అయి ఉంటాయి.
తద్వారా జామ టీ తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చట. ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుందట. అంతే కాకుండా ప్రతిరోజూ జామ టీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకా జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వ్యర్థాలు బయటకు పోయి మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుందట. ఉదయాన్నే జామ టీ తాగితే ఉదర సమస్యలు తగ్గి జీర్ణశక్తిని వృద్ధి చెండుతుందట. ఇంకా జామలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం రోజు తాగే టీ కాఫీ లకు బదులుగా జామ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది.
గమనిక ; ఈ సమాచారం మీ అవగాహన కొరకు వాటి ఉపయోగాలు తెలుపుట కొరకు మాత్రమే అందించబడినది. కాబట్టి పాటించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Also Read:Devara:దేవర..అసలేం జరుగుతోంది?