జామ రసం తాగితే ఎన్ని ఉపయోగాలో!

15
- Advertisement -

అత్యధిక పోషకాలతో పాటు మెండుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫలాలలో జామపండు కూడా ఒకటి. రుచిలో కాస్త ఒగరు తీపి కలగలిపి ఉండే ఈ పండ్లను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లలో విటమిన్ సి, ఏ, బి3, బి6, బి12 ఇలా చాలానే పోషకాలు ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే జామ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం పండ్లలోనే కాకుండా జామ ఆకులలో కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. జమ పండ్లు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. కానీ జామ సీజన్ తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి జమ ఆకులతో రసం చేసుకొని ప్రతి రోజూ సేవిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమౌతున్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు..

జామ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి నీటి రంగు మారిన తర్వాత అందుకే కొద్దిగా పటిక బెల్లం కలుపుకొని తాగితే రక్తపోటు, మధుమేహం అదుపులోకి వస్తాయట. షుగర్ వ్యాధి గ్రస్తులకు జామ దివ్యఔషధంలా పని చేస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాసు జామరసం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇక ఉదయం పూట పడగడుపున ఈ రసాన్ని సేవిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ఈ వేసవిలో రోగ నిరోధక శక్తిని పెంచి డిహైడ్రేషన్, వడదెబ్బ తగలకుండా చూడడంలో జామరసం ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా కంటి చూపు మెరుగు పరచడంలోనూ చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ జామరసం ఎంతో మంచిది. కాబట్టి జామ పండ్లు అందుబాటులో లేని పక్షంలో జామరసం సేవించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:రోహిత్ vs పాండ్య.. ముదురుతున్న వివాదం!

- Advertisement -