నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..హాజరుకానున్న మంత్రి హరీశ్ రావు

360
Gst Council
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో నేడు 38వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగునుంది. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్ అధ్యక్షతన మధ్యాహ్నం 1.30గంటల నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక శాఖ మంత్రులు, పలువురు అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

నేటి సమావేశంలో తెలంగాణకు జీఎస్టీలో రావాల్సిన నష్టపరిహారాన్ని, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నిధుల మళ్లింపు అంశాన్ని మంత్రి హరీశ్‌రావు లేవనెత్తనున్నారు. జీఎస్టీ నష్టపరిహారం కింద తెలంగాణకు కేంద్రం రూ.1030 కోట్లను విడుదలచేసి, మరో రెండునెలల బకాయి 800 కోట్లు పెండింగ్‌లో ఉంచింది. ఐజీఎస్టీ కింద మళ్లించిన రూ.2,800 కోట్లను వెంటనే విడుదలచేయాలని కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేయనున్నారు.

- Advertisement -