శ్రీహరికోట వేదికగా ఇస్రో ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. సమచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ను శాస్త్రవేత్తలు సాయంత్రం 4.10 గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు.
జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్ 11 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోట నుంచి 35 రోజుల వ్యవధిలో నిర్వహించిన మూడో ప్రయోగం ఇదని.. దీన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. జీశాట్ 7ఏ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించాం. శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి ఇది 69వ ప్రయోగమని వెల్లడించారు.
జీశాట్ 7ఏ ప్రయోగంతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు తేనున్నది. ఎనిమిదేళ్ల పాటు సేవలందించనున్న ఈ ఉపగ్రహం కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తివంతమైన సిగ్నళ్లను అందించనుంది. ప్రధానంగా విమానాలకు సిగ్నళ్లు ఉపకరించనున్నాయి.
2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు.
#WATCH: Communication satellite GSAT-7A on-board GSLV-F11 launched at Satish Dhawan Space Centre in Sriharikota. pic.twitter.com/suR92wNBAL
— ANI (@ANI) December 19, 2018