గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్‌సైట్ https:// www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది.
ఈ నెల 17 వరకు కీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుండగా ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలవచ్చని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఈ మెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని వెల్లడించింది. రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రూప్-1 మెయిన్ షెడ్యూల్‌ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో అర్హత పరీక్షగా జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను నిర్ణయించారు.
Also Read:Chandrababu:ఆ తర్వాతే శాఖల కేటాయింపు!