రాష్ట్రం లో అనుభవం గల గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ ఇతర గ్రూప్ 1 అధికారులు విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థలలో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖ ల గ్రూప్ 1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని, పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండి లుగా, డైరెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.2015 లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు పై ఆరుగురు ఐ ఏ ఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధి లో అన్ని గ్రూప్ 1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలం గా స్పందించి అతి త్వరలో గ్రూప్ 1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ తో పాటు శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్. సోమ శేఖర్ తదితరులు ఉన్నారు.
Also Read:శోభిత ధూళిపాళ..‘చీకటిలో’!

