గ్రూప్‌-1..దరఖాస్తు గడువు పెంపు

24
- Advertisement -

గ్రూప్ 1కు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది టీఎస్‌పీఎస్సీ. దరఖాస్తుల గడువును రెండు రోజుల పాటు పొడగిస్తు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరో రెండు రోజుల పాటు అప్లై చేసుకునే వీలు కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీకి ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరణ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2.7లక్షల వరకు అభ్యర్థులు గ్రూప్‌-1 కోసం దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్‌ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -