రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన భూగర్భ జలాలు..

274
Groundwater
- Advertisement -

ఒక్కపుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగంటిన భూగర్భ జలాలు అని వార్తలు వినే వాళ్ళం. నేడు ఉబ్బికి వస్తున్న పాతాళ గంగ అనే వార్తలు వింటున్నాం. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన,మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ వలన చెరువులు నిండటం వలన భూగర్భ జలాల గణనీయంగా పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు. దీనితో పాటుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అటు ఎక్కడ చూసినా జలసిరులు కనిపిస్తున్నాయి.గత సంవత్సరం అక్టోబర్ లో భూగర్భ జలాల రాష్ట్ర సగటు 7.92 అడుగులు కాగా ,ఈ సంవత్సరం అక్టోబర్ నెల వరకు చూస్తే 4.22 గా ఉంది.గత సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు అయింది. కానీ ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే 51 శాతం అధికంగానమోదు అయింది. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 16 ప్రాంతాలు అత్యధిక వర్షపాతం,11 ప్రాంతాలు అధిక వర్షపాతం,6 ప్రాంతాల సాధారణ వర్షపాతం పడింది. అంతేకాదు వర్షాలు ఏ విధంగా కురిసాయో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో 83 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయింది.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

ఆదిలాబాద్ 4.33,భద్రాద్రి కొత్తగూడెం 4.23, భూపాలపల్లి 8.22, హైదరాబాద్ 1.78, జగిత్యాల 2.78, జనగాము2.11, జోగులంబా గద్వాల్ 4.88, కామారెడ్డి 5.91, కరీంనగర్ 2.28,ఖమ్మం 1.82,కొమురం భీమ్ 5.26,మహబూబాబాద్ 1.38,మహబూబనగర్ 3.82,మంచిర్యాల 3.19 , మెదక్ 9.24,మేడ్చల్ 4.76,ములుగు 3.46,నాగర్ కర్నూల్ 3.46, నల్గొండ 4.85,నారాయణపేట 3.40,నిర్మల్ 5.01,నిజామాబాద్ 6.01,పెద్దపల్లి 4.74, రంగారెడ్డి 3.87,సంగారెడ్డి13.52,సిద్దిపేట 5.56, సిరిసిల్ల3.35,సూర్యాపేట 1.45,వికారాబాద్ 5.44,వనపర్తి 2.50,వరంగల్ రురల్ 0.91, వరంగల్ అర్బన్ 2.03,యాదాద్రి 3.75.

నగరంలో పాతాళానికి పడిపోయిన గంగమ్మ ఇటీవలి కుండపోత వానలతో పైపైకి వస్తున్నది. ఎప్పుడూ లేనంతగా అర మీటరులోతులో జలసిరి సంతరించుకున్నది. సికింద్రాబాద్‌ మండల పరిధిలోని సంజీవయ్య పార్కు వద్ద 0.51 మీటర్లలోనే భూగర్భ జల స్థాయి నమోదైంది. గతేడాది అక్టోబరుతో పోల్చితే 1.78 మీటర్లకు ఎగబాకినట్లు అధికారులు తెలిపారు.నగరంలో కురిసిన రికార్డు స్థాయి వర్షానికి భూగర్భం పులకించింది. ఈ యేడు సగటును మించి వర్షపాతం నమోదు కావడం.. ఏకధాటిగా కురిసిన కుండపోత వానలు భూగర్భ జలాల్ని తట్టి లేపాయి. జలసిరిని ఎగిసిపడేలా చేశాయి. హైదరాబాద్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అర మీటర్‌లోనే పాతాళగంగ వచ్చి చేరింది.హైదరాబాద్‌లోని 16 మండలాల పరిధిలోని 21 పీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు అధ్యయనం చేశారు. గతేడాది అక్టోబరు 19తో పోల్చితే ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు నాటికి 1.78 మీటర్లకు భూగర్భ జలం ఎగబాకినట్లు ప్రకటించారు.  

- Advertisement -