పిడుగు పడింది..పెళ్లి చెడింది..!

280
Bride refuses to marry
- Advertisement -

సాధారణంగా అయితే పెళ్లిలో కట్నకానుకల విషయంలోనో, వరుడికి మద్యం అలవాటు ఉందనో, ఆహారం సరిగ్గా పెట్టలేదని రకరకాల కారణాలతో మండపం దాకా వచ్చిన పెళ్లిళ్లు రద్దు చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన కారణంతో పెళ్లి ఆగిపోయింది. బిహార్‌లోని సర్నా జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం మొదలైంది. అప్పటి వరకు హాయిగా జరుగుతున్న పెళ్లి తంతు పిడుగు పాటుతో ఒక్కసారిగా ఆగిపోయింది.

Bride refuses to marry

పిడుగు పడితే పెళ్లి ఆగిపోవడం ఏంటనేగా మీ సందేహం.. అయితే మీరే చదవండి.. వివాహ సమయంలో పిడుగు పడ్డందుకు వరుడు బాగా భయపడ్డాడని, తర్వాత విచిత్రంగా ప్రవర్తించాడని వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. అతడి ప్రవర్తన కారణంగా తాను ఈ పెళ్లి చేసుకోవట్లేదని వధువు అందరి ముందు తెల్చి చెప్పేసిందట. ఇక అంతే పెళ్లికూతురు వివాహం వద్దన్నందుకు రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది.

పెళ్లికొడుకు వైపు బంధువులు దీనిపై ఆగ్రహం వ్యక్తంచేయగా, పెళ్లికూతురు తరఫు బంధువులు వారిపై దాడి చేశారు. వరుడి కుటుంబసభ్యులపై దాడి చేసినందుకు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పిడుగు పడి ప్రాణం పోవడమే కాదు పెళ్లిళ్లు కూడా ఆగిపోతాయి.

- Advertisement -