బోరబండలో పేదలకు నిత్యవసరాల పంపిణీ..

579
Grocery
- Advertisement -

హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్.ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బోరబండలో వలస కార్మికులు,భవన నిర్మాణ రంగం కార్మికులు ఎక్కువగా ఉంటారు.వారికి నిత్యావసరాలు పంపిణీ చేయడాన్ని డిప్యూటీ మేయర్ బాబఫసిదుద్దీన్‌ను అభినందిస్తున్నాను అన్నారు.

ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వంతో పాటు సామాన్యులు కూడా తమ వంతుగా సహాయం చేయాలి.తెలంగాణ వ్యాప్తంగా కోటి మాస్కులు పంపిణీ చేసాం. హైదరాబాద్ రెడ్ జోన్‌లో ఉంది కావున ఇక్కడ సడలింపులు ఇవ్వలేదు. చైనాలో జరిగిన సంఘటనలు చూసి పెద్ద పెద్ద పరిశ్రమలు అక్కడ నుండి తరలి వెళ్తున్నాయి. అవన్నీ భారత ఉపఖండం రావడానికి ఆలోచన చేస్తున్నాయి. ఐటీ రంగం, నిర్మాణ రంగం,పరిశ్రమలు ఇక్కడకు రాబోతున్నాయని తెలిపారు.

డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా అనగానే క్యా కరోనా అని కాకుండా ఖతం కరోనా అనేలా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించి పని చేస్తున్నారు. జిహెఎంసి మున్సిపల్, పోలీస్ శాఖ, వైద్య శాఖ కంటికి కనబడని భూతం కరోనాతో యుద్ధం చేస్తున్నారు. కరోనా భూతాన్ని తరిమెందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.వైద్య సిబ్బందికి, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. బోరబండలో ఉన్న పేదలను బాబా ఫసిదుద్దీన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో అన్ని డివిజన్లలో శానీటైజెషన్ చేయించాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పేదలను,వలస కూలీలను ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు.

- Advertisement -