బనకచర్ల నీటి మళ్లింపుకు అభ్యంతరం వ్యక్తం చేసింది జీఆర్ఎంబీ. గోదావరి నదికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఇరు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి రావాలని సూచించింది జీఆర్ఎంబీ. పోలవరం ప్రాజెక్టు నుండి బనకచర్లకు నీటిని మళ్లించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) మరియు గోదావరి నదీ నిర్వహణ బోర్డు (జీఆర్‌ఎంబీ).
పోలవరం ప్రాజెక్టు నుండి రోజుకు 2 టీఎంసీల నీటిని బనకచర్లకు మళ్లిస్తే, ప్రాజెక్టు ప్రస్తుత ఆపరేషన్ మారే ప్రమాదం ఉందని పేర్కొంది జీఆర్‌ఎంబీ. నీటి మళ్లింపులో మార్పులు చేయాలంటే మధ్యప్రదేశ్, మరియు ఒడిశా రాష్ట్రాలతో సంప్రదించి చేయాలని పేర్కొంది జీఆర్‌ఎంబీ.
అదనంగా 200 టీఎంసీల నీటిని మళ్లించాలనే ప్రస్తుత ప్రతిపాదన పోలవరం ప్రాజెక్టు కోసం ఆమోదించబడిన డీపీఆర్‌లో భాగం కాదని, ఈ మళ్లింపు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికలో మాత్రమే చేర్చబడిందని పేర్కొంది పోలవరం ప్రాజెక్టు అథారిటీ.
Also Read:తిరుమలలో భక్తుల రద్దీ
అదనపు నీటి మళ్లింపు కోసం 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) నిబంధనల ప్రకారం కొత్త డీపీఆర్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాలకు సంబంధించి ఎలాంటి అధికారిక పంపిణీ జరగలేదని, CWC దీనిని గమనించాలని జలశక్తి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది జీఆర్‌ఎంబీ.

