గ్రీన్ ఇండియా చాలెంజ్‌ద్వారా దేశాన్నికి పకృతి ఇచ్చే ఫలాలను తెలుపుతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ హృదయాన్ని కదిలించి కళ్లలో నీళ్లు తెప్పించిన ఈ పాట పాడిన కవి,గాయకుడు కార్తీక్‌కొడకండ్ల రాసి పాడిన పాటకు ఫిదా ఆయ్యారు.
పుట్టినప్పడు ఉయ్యాల అవుతా..
శ్వాసకు ఊపిరి అవుతా..
గూడును అయ్యి రక్షణ అవుతా..
పోయినప్పుడు కాడెను అవుతా…
ఇంతా చేసి మనిషి స్వార్థానికి
మాత్రం బలవుతున్నా..
ఇదీ చెట్టమ్మ గోడు..విచక్షణా రహితంగా నరికివేతకు గురవుతున్న చెట్ల అరణ్య రోదనపై కవి, గాయకుడు కార్తీక్ కొడకండ్ల రాసి, ఆలపించిన గేయం..చెట్ల అవసరాన్ని, మానవుడికి అవి ఉపయోగపడుతున్న విధానాన్ని పాట రూపంలో ఆలపించిన కార్తీక్ వీడియోను ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ కవి హృద్యమైన తపన అందరికీ కను విప్పు కావాలన్నారు. చెట్ల నరికివేత తగ్గడం, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచడం మన జీవన విధానం కావాలని ఎంపీ సంతోష్‌కుమార్ ఆకాక్షించారు.