రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా , మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, దుబ్బాక మండలంలోని కూడవెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో, సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఆలయ ప్రాంగణంలో పరమ శివునికి ప్రీతికరమైన మారేడు మొక్కను ఆలయ ప్రధానార్చకులు, బ్రహ్మా శ్రీ సంకేత శర్మ తో కలిసి నాటారు.
ఈ సందర్భంగా సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం రోజు కూడవెళ్లి క్షేత్రం లాంటి పురాతణాలయంలో మొక్క నాటడం అదృష్టంగా భావిస్తున్నానని, అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎం.పీ. సంతోష్ కుమార్ గారు ఆ పరమ శివుని కృపతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన పూజారి సంకేత శర్మ , ఎం.పీ. సంతోష్ కుమార్ గారి పేరు మీద అర్చన జరిపి ఆశీర్వచనాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి పూర్ణ, ఆలయ అర్చకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.