గ్రీన్ ఛాలెంజ్..జూట్ బ్యాగ్స్ పంపిణీ

2
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా సంక్రాంతి సందర్బంగా చంపాపేట్ లోని ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ డా. బాలరాజు నాయుడు ఆధ్వర్యంలో మొక్కలు నాటి జూట్ బ్యాగ్స్ పంపిణి చేయడం జరిగింది.

డా. బాల్ రాజు నాయుడు, డా. కిరణ్ కుమార్ రెడ్డి మరియు డా. మార్కండేయులు మాట్లాడుతూ చెడును వదిలేసి మంచిని అలవారుచుకునే ఈ బోగి పండగ సందర్బంగా ప్లాస్టిక్ వదిలేసి పేపర్ బ్యాగ్స్ లేదా జూట్ బ్యాగ్స్ వాడాలని కోరారు. మొక్కలు ప్రతీ ఒక్కరు నాటాలని మంచి ఆరోగ్యం కావాలంటే ఇంటింటికి మొక్కలు నాటాలని కోరారు.

మంచి వాతావరణం ఉంటేనే మన ఆరోగ్యం బాగా ఉంటుందని. ఇంతటి మంచి కార్యక్రమం లో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గర్రెపల్లి సతీష్, Prof నర్సింహా రావ్ గారు, డా. సుదర్శ, డా. రవికిరణ్ మరియు ఓనస్ హాస్పిటల్ బృందం పాల్గొన్నారు.

Also Read:TTD:అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

- Advertisement -