పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత..

62
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు హన్మకొండలోని హంటర్ రోడ్ లో విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో స్థానిక కార్పోరేటర్ శ్రీమతి నెక్కొండ కవిత, కిషన్ గారల నేతృత్వంలో TSPSC సభ్యులు కారం రవిందర్ రెడ్డి చెట్లు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇటీవల ఆదర్శ వివాహం చేసుకున్న నడిపెల్లి శ్రీధర్ రావు (oc) అరుణ (SC) దంపతులచే మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నది. పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత అని గుర్తుచేస్తున్నది. ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములు అయి హరిత తెలంగాణ నుండి హరిత భారత నిర్మాణం వైపు అడుగులు వేయాలి. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు మల్లుకార్జున్, రామస్వామి, విద్యాసాగర్, ఈశ్వరయ్య జాగృతి నాయకులు డా. రాజేశ్వర్ రావు మరియు స్థానిక నేతలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -