గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన మలేషియా టీఆర్ఎస్

428
maleshiya green challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ని ఇగ్నటింగ్ మైండ్స్ కో ఫౌండర్ రాఘవ గారి సహకారంతో TRS NRI మలేషియా ఆధ్వర్యంలో అక్కడ తెలుగు సంఘాలయిన TAM మరియు MYTA లతో కలిసి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మలేషియా తెలుగు అకాడమి సభ్యులు వారి ఛాలెంజ్ ని స్వీకరించి అకాడమీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా విద్యార్థులతో తమవంతుగా తలా 3 మొక్కల చొప్పున 100కు పైగా మొక్కలు నాటించారు.

ఈ కార్యక్రమానికిముఖ్య అథితులుగా TAM ప్రెసిడెంట్ దాతుక్ డా.అచ్చయ్య కుమార్ రావు, డిప్యూటీ ప్రెసిడెంట్ డా. వెంగట ప్రతాప్, వైస్ ప్రెసిడెంట్ సీతరావు, కార్యదర్శి శివ సూర్యనారాయణ, అప్పరావు, రామ్మూర్తి, వెంకటేశన్, మరియు మలేషియా తెలంగాణ సంఘం అధ్యక్షులు సైదం తిరుపతి గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో TRS MALAYSIA అధ్యక్షులు చిట్టిబాబు చిరుత, ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్, హరీష్ మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -