మన భారతీయ వంటకాలలో పచ్చిమిర్చికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం ఏదో ఒక వంటకంలో పచ్చిమిర్చిని ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పచ్చిమిర్చిని పచ్చగా తినడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరికొందరికి పచ్చిమిర్చి తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే విపరీతమైన మంట కారం ఉండటం వల్ల చాలామంది పచ్చిమిర్చి తినడానికి సుముఖత చూపరు. కానీ పచ్చిమిర్చి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చిమిర్చిలో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఇందులో కార్బోహైడ్రేట్స్, పొటాషియం, జింక్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి.
ఇంకా పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి. ఇందులో ఉండే అనామ్లజనకాలు, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి రసాయనాలు క్యాన్సర్, గుండె జబ్బులను దూరం చేస్తాయట. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చిమిర్చి ఎంతో ప్రయోజనకారి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే మూలకం రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ను నియంత్రిస్తుందట. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇంకా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పచ్చిమిర్చిని ఆహార డైట్ లో చేర్చుకుంటే మేలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఎందుకంటే పచ్చిమిర్చికి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచే సామర్థ్యం ఉంటుందట. అయితే పచ్చిమిర్చి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ దీనిని మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పచ్చిమిర్చిని అధికంగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. పచ్చిమిర్చిలో క్లియర్ సాప్ ప్రీసెట్ సమ్మేళనం ఉంటుంది దీని వల్ల కంటికి తగిలినప్పుడు విపరీతమైన మంట ఏర్పడి కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందట. ఇంకా పచ్చిమిర్చిని నేరుగా తినడం లేదా నోట్ల నమ్మడం వల్ల తీవ్రమైన మంట కలుగుతుంది ఇంకా నోట్లో పొక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పచ్చిమిర్చిని ఎక్కువగా తింటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. కాబట్టి పచ్చిమిర్చి తినే విషయంలో మితంగా తింటూ జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!