యశోద నుంచి అపోలోకు గ్రీన్‌ చానల్‌..

127
green channel 1
- Advertisement -

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజయ్‌ కుమార్‌ (32), ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు ఆయనను మలక్‌పేట యశోదకు తరలించారు. కాగా, వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. దీంతో అవయవదానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో చిక్సిత్స పొందుతున్న ఓ వ్యక్తికి, రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన విజయ్‌ కుమార్‌ కానిస్టేబుల్‌ గుండెను అమర్చనున్నారు. దీనికోసం మలక్‌పేట యశోద నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో వరకు పోలీసులు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేశారు.

- Advertisement -