ఢిల్లీలో ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

486
green challenge
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమంలా సాగుతోంది. హర హైతో భర హై ఉద్యమంలో తాము సైతం అంటూ జాతీయ దినపత్రికల ఫొటో జర్నలిస్టులు ముందుకు వచ్చారు.

ఈ మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ దినపత్రికల ఫోటో జర్నలిస్టులందరు కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. హరిత మహా యజ్ఞంలో తాము సైతం భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

mp santhosh kumar

mp santhosh kumar

- Advertisement -