శాతావాహన యూనివర్సిటీలో గ్రీన్ ఛాలెంజ్..

283
haritha haram
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి విశేషమైన స్పందన లభించింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా స్థానిక శాతవాహన యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ టి. చిరంజీవులు గారు ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంగీకరించి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రొఫెసర్ భరత్ కుమార్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రొఫెసర్ భరత్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము మొత్తం మొక్కలను నాటి పచ్చదనమే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2015 లో ప్రారంభించడం జరిగిందని అందుకని మన వంతు కృషి తో సాధ్యమైనన్ని మొక్కలు నాటాలని సూచించారు. అలాగే జాతీయ సేవా సంస్థ సమన్వయకర్త డాక్టర్ డి. హరి కాంత్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా సాధ్యమైనన్ని ఎక్కువ మొక్కలు నాటి యూనివర్సిటీ నీ సస్యశ్యామలం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం శ్రీ రంగ ప్రసాద్ మరియు జాతీయ సేవా సంస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ తోట విజయకుమార్, మరియు ఇతర విభాగాల అధ్యాపకులు, నాన్ – టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

- Advertisement -