రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రం, దేశం ధాటి ఆస్ట్రేలియా లో సిడ్నీ నగరంలో టీఆర్ఎస్ విభాగం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ చేపట్టారు. తెలంగాణలోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలపటానికి సిడ్నీ లో మొక్కలు నాటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .
ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ స్వీకరించిన మహేష్ బిగల ద్వారా తాను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి సిడ్నీలో రాజేష్ గిరి రాపోలు అద్వర్యం లో కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ డబ్ల్యూ ఇంచార్జి ప్రవీణ్ పిన్నమ, సరళ కుమారి , జ్యోతి వడ్రేవు , స్వాతి నల్లాన్ , రవి దూపాటి ,లక్ష్మణ చార్యులు నల్లాన్, పరశురామ్ మొతుకుల, జస్వంత్ కొడరపు ,సాంబ శివ రెడ్డి పాల్గొన్నారు.
హరితహారం లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఒక ఉద్యమం ల కొనసాగుతుందని , ఇది ఇలాగే కొనసాగుతూ తెలంగాణ పచ్చ దనం, కాలుష్యం లేకుండా ఆరోగ్య ఆకు పచ్చ తెలంగాణ కావాలని కోరుకుంటున్నాని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు.
@MPsantoshtrs #greenindiachallenge #harahaitohbharahai accepted #greenchallenge from @mbigala , now we nominate @Chand1Korukanti @puttamadhumnt , Australia MP and Minsiter @Jason Wood .congrats @MPsantoshtrs Anna for great initiative 4 climate change#jaitelangana @TRSAustralia pic.twitter.com/1LkFmTH6EJ
— KNR-KasarlaNagenderReddy (@KNRTRSAUSTRALIA) November 8, 2019