ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో జమ్మి చెట్టు

9
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు కర్మన్ ఘట్ శ్రీ ప్రసన్నంజనేయ స్వామి వారి దేవాలయం లో జమ్మి చెట్టును నాటారు ఆలయ కమిటీ సభ్యులు మరియు వేదపండితులు.

అర్చకులు శంకర శర్మ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో EO ప్రేమ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, రఘనందన శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -