హరీష్ బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

4
- Advertisement -

మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట MLA తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితసేన లో భాగంగా గజ్వెల్ మండల ప్రభుత్వ పాఠశాల లో 10 వ తరగతి లో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహంగా నగదు అందచేసి వారితో మొక్కలు నాటించిన సిద్దిపేట జిల్లా హరిత సేన ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావు . మరియు హరిత సేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, హరిత సేన గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ అనిల్ మొగిలి.

చెప్యాల రాజేశ్వర్ రావు, గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సంపాదించిన విద్యార్థులకు ప్రోత్సహం అందించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నేటి భావి తరాలకు మనం ఇచ్చే ఆస్థి మంచి చదువు, మంచి ప్రకృతిని ఇవ్వడం అని అన్నారు. హరిత సేనలో భాగంగా పిల్లలు వారి ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటించడం చాలా అనందంగా ఉంది అన్నారు. వారి నాటిన మొక్కలు పెద్ద అయి ఎంతో మంది కి నిడనిస్తుందో అదే విదంగా పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి మరెంతో మందికి తోడుగా, నీడగా ఉండాలని కోరారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ఎల్లేషం, రాచకొండ మహేష్, లోకేష్ రెడ్డి, కాటేపల్లి కృష్ణా రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Also Read:కరోనా..జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -