ఢిల్లీ అరవలి ఫారెస్ట్‌లో గ్రీన్ ఛాలెంజ్

4
- Advertisement -

ఢిల్లీలోని వసంత్ విహార దగ్గర అరవలి ఫారెస్ట్ ను సందర్శించారు జోగినపల్లి సంతోష్ కుమార్. అరవలి ఫారెస్ట్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు మాజీ ఎంపీ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ సంతోష్ కుమార్, అరవలి టీం సభ్యులు. 2004 కంటే ముందు అరవలి ఫారెస్ట్ అంత డంపింగ్ యార్డ్, మైనింగ్ జరుగుతూ ఉండేదన్నారు.

మైనింగ్ నుండి రక్షించాలని కోర్టుకు వెళ్లారు స్థానిక ప్రజలు. దీనితో అరవళి ఫారెస్ట్ ను రక్షించాలని కోర్ట్ ఆదేశాలు,కోర్టు ఆదేశాలతో ఢిల్లీ సర్కార్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. 200 కోట్లు కేటాయించి 700 ఎకరాలలో అటవీ ని సంరక్షణ చేసిన డిల్లీ యూనివర్సిటి ప్రొఫెసర్లు హుస్సేన్, దిశాంత్ మరియు వాళ్ల అరవలి టీం అడవి రక్షించి, సుందరంగా తయారు చేశారు.

వారు సంరక్షించిన అడవిలో నేడు 150 రకాల బట్టర్ ఫ్లై జాతులు,200 పక్షులు కనువిందు చేస్తున్నాయి.అంతేకాకుండా అందులో ఉన్న గుంతలను అందంగా ఏర్పాటు చేసి ఇంకుడు గుంతలు గా మార్చారు.దీనితో అరవళి అటవీ లో భూగర్భ జలాలు సైతం పెరిగాయి.ఢిల్లీలోని విధుల్లో 400 ఎయిర్ క్వాలిటీ ఉంటే అరవళి లో 170 ఉంటుంది దీనితో స్వచ్ఛమైన ఆక్సిజన్ కు నిలయంగా అరవళి ఫారెస్ట్ ఉంది.

Also Read:సంపత్ నందితో శర్వా 38!

- Advertisement -