గ్రీన్ కార్డు..శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్

4
- Advertisement -

అమెరికాకు వెళ్లే ప్రతి ఒక్కరి కల అక్కడి గ్రీన్ కార్డు సాధించడమే. గ్రీన్ కార్డు వస్తే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీంతో, అమెరికా పౌరులుగా అక్కడే సెటిల్ కావచ్చు.

అయితే, అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం ఇక్కడ ఉండపోయే హక్కు ఉండదని చెప్పారు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశం కాదని… దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమెరికా పౌరులుగా తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారని చెప్పారు..

అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాన్ని తిరిగి తీసుకోవచ్చు. సుదీర్ఘకాలం అమెరికాలో లేకపోయినా, నేరాలకు పాల్పడినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా గ్రీన్ కార్డును వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

Also Read:గాలి మాటలు..గబ్బు కూతలు: రేవంత్‌పైకేటీఆర్ ఫైర్

- Advertisement -