సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే.. కోట్లు లాగేసారు …

230
Nikhil
- Advertisement -

వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్న నిఖిల్ సినిమాల‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా నిఖిల్ త‌మిళ రీమేక్ `గ‌ణిత‌న్` సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించాడు. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింద‌ట‌. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించాల్సి వుంది.

Nikhil

అయితే స్పైడర్ కారణంగా ఆయన కాస్త ఇబ్బందుల్లో వున్నారు. మరీ సమస్యలు కాదు కానీ, మాంచి సినిమా అవుతుందనుకున్నది అలా కావడంతో, కాస్త డీలా పడ్డారు. అయితే నిఖిల్ నటించిన ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావించిన సినిమా జనం ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే అవుట్ రేటు హ‌క్కులు దక్కించుకునేందుకు సిద్ధ‌పడ్డార‌ట‌. ఇందుకుగానూ 11 కోట్ల రూపాయ‌ల‌ను నిర్మాత‌కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఈ సినిమాను 7 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో నిర్మించాల‌ని నిర్మాత భావిస్తున్నారు. దాంతో సినిమా ప్రారంభించకుండానే నాలుగు కోట్లు లాభం వచ్చినట్లైంది.

పెద్ద హీరోల సినిమాలే బిజినెస్ డైలమోలో ఉంటున్న ఈ రోజుల్లో..మీడియం రేంజి హీరో సినిమా ప్రారంభంలోనే లాభాల్లో పడటం మామూలు విషయం కాదు కదా.

- Advertisement -