టి.ఆర్.యస్ పోలాండ్ శాఖ ఆధ్వర్యంలో వార్సా నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య నాయకుడు మహేష్ కుమార్ ఊరుగొండ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో, కెసిఆర్ 64 వ పుట్టినరోజు కేక్ కట్ చేసి కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపి, జై కేసీఆర్ ….కేసీఆర్ నాయకత్వం వర్ధిలాల్లని నినాదించారు . కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని, భగవంతుడు వారికి ఆశీస్సులు అందించాలని కోరారు.
మహేష్ కుమార్ మీడియా సందేశంలో గతంలో లండన్‌లోని తెరాస శాఖలో పని చేస్తున్నప్పుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నానని, మళ్ళీ ఇలా పోలాండ్లోని తెరాస శాఖ ఆద్వర్యంలో కేసీఆర్ వేడుకలు నిర్వహించడం చాలా గర్వాంగా ఉందని, ఈ అవకాశం కలిపించిన కేసీఆర్‌కి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల ప్రతక్షంగా పోలాండ్ వచ్చి మరీ తెరాస శాఖను ఏర్పాటు చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన ఎన్నారై తెరాస కో ఆర్డినేటర్ మహేష్ బిగాలకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు సలహాలు సూచనలిస్తున్న ఎన్నారై తెరాస యుకె అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంకి మరియు శ్యామ్ బాబుకి కూడా కృతఙతలు తెలిపారు.
ఈ వేడుకల్లో ముఖ్య నాయకుడు మహేష్ కుమార్ ఊరుగొండ, సభ్యులు జగన్, కార్తీక్, మనీష్, ఫణి, సునీత్, అజయ్, సందీప్, మోను,సూర్య, లిఖిత్, శ్రీనాథ్, హరీష్, నవీన్, గోకుల్, బుజ్జి బాబు, గోవర్ధన్, బలరాం తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.