సంజూ శాంసన్‌కు ఘనస్వాగతం

1
- Advertisement -

టి20 ప్రపంచకప్ విజయానంతరం తన స్వస్థలం కేరళకు చేరుకున్న సంజూ శాంసన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌ కుట్టీ విమానాశ్రయానికి వచ్చి సంజూ శాంసన్‌ను సత్కరించారు.

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టులో పలువురు ఆటగాళ్లు మెరిసినా, సంజూ శాంసన్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ప్రారంభ మ్యాచ్‌లలో ఎక్కువ అవకాశాలు రాకపోయినా, వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు సాధించాడు. అదే విధంగా ఫైనల్లో కూడా 89 పరుగులు చేసి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి

టోర్నమెంట్ మొత్తం 317 పరుగులు చేసిన సంజూ శాంసన్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను ఆయనకు “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డు కూడా లభించింది.

- Advertisement -