శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం..

4
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవిత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘనస్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. కవిత వెంట కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అభిమాన నాయకురాలు దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టకు తరలివచ్చారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అయితే 5 నెలల తర్వాత ఈ రెండు కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు కావడంతో హైదరాబాద్ చేరుకున్నారు.

తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని …ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పుకొచ్చారు కవిత.

Also Read:KTR:రాజీవ్ గాంధీపై రేవంత్‌ది కపట ప్రేమ

- Advertisement -