సూర్యాపేటలో కేటీఆర్‌కు నీరాజనం

7
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికింది ఉద్యమాల పురిటి గడ్డ సూర్యాపేట. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ అన్ని జిల్లాల పర్యటనకు సిద్దమై.. తొలి సమావేశం సూర్యాపేటకు విచ్చేసిన సందర్భంగా దారి పొడవున అడుగడుగునా ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు. వారందరికి అభివాదం చేశారు కేటీఆర్.

అనంతరం మాట్లాడిన కేటీఆర్… తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామ రక్ష అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడు ప్రాత‌ల్లో విజ‌య‌వంతమైంది. 14 ఏండ్లు ఉద్య‌మ‌పార్టీగా విశ్వ‌రూపం చూపించాం. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా త‌మ కోరిక‌ల‌ను ఎలా నెర‌వేర్చుకోవ‌చ్చు అని చూపించాం. తెలంగాణ సాధించాం అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలో కేసీఆర్‌కు మ‌నీ ప‌వ‌ర్ లేదు.. మ‌జిల్ ప‌వ‌ర్ లేదు.. కుల బ‌లం లేదు.. ధ‌న బ‌లం లేదు.. మీడియా లేదు. ప్ర‌తికూల శ‌క్తుల‌న్నీ హైద‌రాబాద్‌లో అడ్డా పెట్టి తొక్కి పారేస్తాం అని హుంక‌రింపులు కానీ 14 సంవత్సరాలు శ్రమించి తెలంగాణ‌ను సాధించారు అని కేటీఆర్ తెలిపారు.

Also Read:బెట్టింగ్ యాప్స్‌.. హీరోలపై కేసు!

ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్ర‌మే. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి 25వ ఏడాదిలోకి వ‌చ్చే నెల 27న అడుగుపెట్ట‌బోతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -