- Advertisement -
బస్సు యాత్ర తోవలో గజ్వేల్ వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఘన స్వాగతం పలికారు ప్రజలు. గత పదిహేను రోజులుగా తమ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న బస్సు యాత్ర తమ పట్టణం చేరుకోవటం పట్ల ఆనందంతో ఆహ్వానం పలికారు.
గజ్వేల్ చేరుకున్న తమ మహా నేతకు మంగళ హారతులతో స్వాగతం పలికి విజయ తిలకం దిద్దిన గజ్వేల్ మహిళలు బస్సు యాత్రను నర్సాపూర్ దిశగా సాగనంపారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అధినేతను చూడడానికి తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ నేతలను పలకరిస్తూ కేసీఆర్ బస్సు యాత్ర ముందుకు సాగింది.
Also Read:‘ఆర్య’ నా జీవితాన్నే మార్చేసింది..
- Advertisement -