బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం

169
- Advertisement -

మారు మూల గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే లో విజేత గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేస్తున్న పల్లవి ప్రశాంత్ కు గజ్వేల్ నుండి ఘన స్వాగతం పలకనున్నారు. తమ గ్రామ బిడ్డ బిగ్ బాస్ 7 లో విజయం సాధించడంతో అతని రాక కోసం గ్రామం లో పండుగ వాతావరణం నెలకొన్నది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూర్ గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ 13 వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు.తండ్రి గొడుగు సత్తయ్య, విజయ ల మొదటి కొడుకు. గొడుగు పల్లవి ప్రశాంత్ డిగ్రీ చదువుకున్న ప్రశాంత్ తండ్రికి కుటుంబ పోషణ భారం కావడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తండ్రికి చేదోడుగా వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. తండ్రికి కుడుభుజంలా మారాడు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, రైతన్నల జీవన విధానం, వారి స్థితిగతులు, కష్టాలు,కన్నీళ్లు, బాధలు ప్రపంచానికి తెలియజేయాలనే కోరికతో సోషల్ మీడియా లో విరివిగా వీడియోలు చేస్తూ ప్రాచుర్యం పొందాడు. అనంతరం టిక్ టాక్ లో వీడియోలు చేసి ఫేమస్ యువరైతు గా గుర్తింపు పొందాడు. 2017 నుండే నటనపై మక్కువతో డబ్బింగ్ వీడియోలు, యాక్టింగ్ వీడియోలు చేస్తూ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. గ్రామీణ జానపద వీడియో సాంగ్స్ లో, హీరో గా నటించి మెరిపించాడు .షార్ట్ ఫిలిమ్స్ లో చిన్నచిన్న పాత్రల్లో, న్యూస్ ఛానెల్స్ లో దండోరా లాంటి ప్రోగ్రామ్స్ లో నటించాడు. రైతు పడే కష్టం పై వీడియోలు చేస్తూ దాదాపు 5 లక్షల మందికి దగ్గరయ్యాడు.

గత 3 సంవత్సరాల నుండి బిగ్ బాస్ ఛాయిస్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ ఏడు బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం దక్కించుకొని విజేతగా నిలిచాడు. దయచేసి నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి నాగార్జున గారు అంటూ వందల వీడియోలు చేసి ఉంటాడు ప్రశాంత్. మొత్తానికి అతని కోరికను బిగ్ బాస్ టీం మన్నించింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతుబిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి తన జీవిత లక్ష్యం అని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ కళ విజయం తో నెరవేరింది. తాను అనుకున్నట్లుగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి విజయం సాధించాడు. స్టేజ్ మీదకి భుజాన వడ్ల బస్తా మోసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. అలాగే నాగార్జునకి కోల్గూర్ మట్టిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రశాంత్ కళ్ళలో సంతోషం చూసి నాగార్జున ఫిదా అయిపోయారు. రైతు,వ్యవసాయం గురించి గొప్పగా చెబుతూ అసలు బిగ్ బాస్ కి ఎందుకు రావాలని అనుకున్నావ్ అంటూ ప్రశాంత్ నూ నాగార్జున అడగగా తనను చాలామంది అవమానించారని నీకు అసలు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం అసాధ్యమని వెక్కిరించారంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అందుకోసమే బిగ్ బాస్ కి రావాలని డిసైడ్ అయినట్లు అప్పట్లో ప్రశాంత్ చెప్పాడు. మొత్తానికి అనుకున్నది సాధించినందుకు నోట మాట రావడం లేదంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రశాంత్. నాగార్జున ప్రశాంత్‌ కి ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికిచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే.ఇదిలా వుండగా బిగ్ బాస్ లో గెలిచిన అనంతరం తొలిసారిగా తన స్వగ్రామం అయిన కొల్గూర్ గ్రామానికి పల్లవి ప్రశాంత్ ఈ రోజు రానున్నాడు.అతని రాకతో అభిమానులు పల్లవి ప్రశాంత్ కు ఘనంగా స్వాగతం పలకనున్నారు.

Also Read:కేబినెట్‌లో చోటు.. నేతల ఫైట్!

- Advertisement -