స్థానిక సంస్థలు మరింత బలోపేతం : సీఎం కేసీఆర్

148
cm kcr
- Advertisement -

పంచాయతీల మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ కేటాయిస్తాం అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. సోమవారం ప్రగతి భవన్‌లో స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం…. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్‌ యార్డులు, నర్సరీలు, వైకుంఠ ధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తం అన్నారు.

మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, పంచాయతీలు నిధులను వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం కల్పించిందన్నారు. జిల్లా, మండల పరిషత్‌లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటదని వెల్లడించారు.

గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టినం. కానీ కొన్ని చోట్ల రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నరు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం అని తెలిపారు సీఎం కేసీఆర్.

- Advertisement -