ఉప ఎన్నికల్లో జీపీఎస్‌ వ్యవస్థ కీలక పాత్ర..

172
dubbaka bypolls
- Advertisement -

ఎన్నికల్లో సెక్టార్ అధికారుల పాత్ర ఎంతో కీలకం. అయితే అలాంటి కీలక అధికారులను సమర్థవంతంగా వినియోగించు కోవడంలో జీపీఎస్‌ వ్యవస్థ కీలక పాత్ర వహించింది. సెక్టార్ పరిధిలో జరిగే ప్రతి అంశంకు సంబంధిత సెక్టార్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్నికల పోలింగ్‌లో సెక్టార్ అధికారుల సేవలను సాంకేతిక దన్నుగా సమర్థవంతంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం వారి వాహనాలను అనుసంధానం చేసింది. సెక్టార్ అధికారుల సేవలను ప్రభావ వంతంగా ఉప యోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

జీపీఎస్‌ రిసీవర్ ద్వారా సెక్టార్ అధికారుల ఎక్కడ ఉన్నారు.. నిర్దేశిత సమయంకు గమ్య స్థానంకు చేరుకున్నారా లేదా ? సమస్యలపై ప్రతి స్పందన ఎలా ఉంది? వాహనం వేగంగా కదులుతుందో, ఏ దిశలో వెళుతుందో.. వంటి అంశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళ్ళి కెరి మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌పై వీక్షించారు. క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాలలో సమస్యలు తలెత్తినపుడు సెక్టార్ అధికారులను అప్రమత్తం చేశారు. జీపీఎస్‌ వ్యవస్థతో సెక్టార్ అధికారుల వాహనాలకు అనుసంధానం చేయడం, సెక్టార్ అధికారుల వాహనాల కదలికలను జిల్లా యంత్రాంగం గమనిస్తుండడంతో సెక్టార్ అధికారులు ఎన్నికల పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ విధులను సక్రమంగా నిర్వర్తించారు.

- Advertisement -