- Advertisement -
కర్ణాటకలో ఎట్టకేలకు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది.
కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. విశ్వాసతీర్మానంపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్‌ను స్పీకర్ నిర్వహించారు. కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గిన బీజేపీ, కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
బల పరీక్ష ఓటింగ్ :
జేడీఎస్-కాంగ్రెస్: 99
బీజేపీ: 105
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ : 103
- Advertisement -