దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై…

190
wi fi
- Advertisement -

దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని లాంఛ్ చేయాలన్న కేంద్రం ఫ్లాన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ డేటా ఆఫీసుల నుంచి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అందించడం కోసం పబ్లిక్ వైఫై నెట్ వర్క్స్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని వదిలేందుకు పీఎం-వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ ఫేస్(PM-WANI)ని లాంఛ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వృద్ధి చేసేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1548 కోట్లను కేటాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద పథకం మొత్తం కాలానికి రూ. 22,810 కోట్లు..అంటే 2020-2023 ఏళ్ళ మధ్య సుమారు 58.5 లక్షల మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు.

- Advertisement -