- Advertisement -
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రాకు ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీజీ భద్రత స్థానంలో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు.
ఈ ముగ్గురి సెక్యూరిటీపై ఇటీవల జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో చర్చించారు. ఆ నివేదిక ప్రకారమే వారికి ఎస్పీజీ భద్రత తొలగించినట్లు సమాచారం. జడ్ ప్లస్ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) పర్యవేక్షించనున్నది.ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
- Advertisement -