మొక్కలు నాటిన ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్

314
ramchander-rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించారు రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు. తన ఊరు ఆకు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలని ఆయన తలచారు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్న పేట తన స్వగ్రామం. తనకు ఉన్నభూమిలో 4 ఎకరాలను పచ్చదనం పెంపుకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఆ భూమి రాళ్లు, రప్పలతో ఉండటంతో తానే చొరవ తీసుకున్నారు. రాళ్లు, రప్పలను తొలగించి, ఒక మీటరు మేర ఎర్ర మట్టిని నింపారు. గ్రామస్థులను కూడా చైతన్య పరిచి మొక్కలు నాటే పనికి పూనుకున్నారు. అందరి సహకారంతో 1300 టేకు మొక్కలు, 1300 రోజ్ వుడ్, 800 కదంబ, 1000 ఎర్ర చందనం, 300 సంపంగి, 200 సిల్వర్ ఓక్ మొక్కలను నాటించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ తనలో స్ఫూర్తిని నింపాయని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో చాలా మార్పు వచ్చిందనీ, దీనికి చొరవ చూపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ సాధన లక్ష్యంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -