TTD:26 నుండి తెప్పోత్సవాలు

4
- Advertisement -

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి ఫిబ్రవరి 01వ తేదీ వరకు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజస్వామివారి పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు. ఆ త‌రువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

జనవరి 26న శ్రీ కోదండరామస్వామివారు, జనవరి 27న శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థసారథిస్వామి వారు, జనవరి 28న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు, జనవరి 29న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, జనవరి 30, 31, ఫిబ్రవరి 01 తేదీల్లో అమ్మవార్లతో శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పల‌పై భక్తులకు కనువిందు చేయ‌నున్నారు. చివ‌రి రోజు తెప్పోత్స‌వం అనంత‌రం ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.

Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

- Advertisement -