నల్లపోచమ్మకు గవర్నర్,సీఎం ప్రత్యేక పూజలు

37
- Advertisement -

తెలంగాణ సచివాలయంలో ఆధ్మాత్మిక సందడి నెలకొంది. ఇవాళ సచివాలయ ప్రాంగణంలో ఆలయాల ప్రారంభం కన్నులపండువగా జరిగింది. నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌.

నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాలయం,హనుమాన్,గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

Also Read:ద్రాక్షతో మధుమేహానికి చెక్!

- Advertisement -