వనదేవతల సన్నిధిలో గవర్నర్లు తమిళిసై,దత్తాత్రేయ

224
governor

మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. ఇక సమ్మక్కను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమ్మక్కను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

అనంతరం సారలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆదివాసీ పూజారులు వీరిద్దరికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు సమ్మక్క తల్లి నామస్మరణతో మేడారం పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఇక ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మేడారానికి రానున్నారు. అమ్మవార్లకు మొక్కలు చెల్లించనున్నారు. రేపు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశంతో సమ్మక్క-సారలమ్మ జాతర ముగియనుంది.