ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన గవర్నర్

27
Governor
- Advertisement -

రాష్ట్ర గవర్నర్ తమిళి సై తన మంచిమనసు చాటుకున్నారు. ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు గుండెపోటుకు గురికావడంతో ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్సచేసి ప్రాణాలు కాపాడారు గవర్నర్ తమిళి సై.

మిగిలిన ప్రయాణీకులతో పాటు కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో ఓ ప్రయాణికుడు షేర్ చేయగా ఫోటోలు వైరల్‌గా మారాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంబీబీఎస్, ఎండీ- డీజీఓ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -