గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం..

29
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతు రాజ్యం కావాలని అంటుంటే కేంద్రానికి రైతులనుకూలీలను చేస్తం…వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం అనే బీజేపీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలోకి మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 700మంది రైతుల ప్రాణాలు తీసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బలవంతం చేస్తున్నది అన్నారు. కేంద్రం డిస్కమ్‌లను ప్రవైటీకరించాలని మా ఒత్తడి తెస్తుందని అన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంపైకి కేంద్రం దండయాత్ర చేస్తుందన్నారు. శనివారం గవర్నర్ ధన్యవాద తీర్మానం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తానికి చెప్తామని అన్నారు. కార్పొరేటర్లది ఈ దేశంలో బాగా అయిపోయింది. ఇప్పుడు అబ్‌కీ బార్ కిసాన్‌ సర్కార్‌ అని కేసీఆర్ నినాదం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

దేశంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమవుతున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా ప్రత్యామ్నయంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం మా నాయకుడి నేతృత్వంలో కదం తొక్కి ముందుకుపోతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లెవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ దీటుగా సమాధానం ఇచ్చారు. ప్రతి పనికి కేసీఆర్‌కు దూరదృష్టి కలిగిన నేతగా చెప్పకొచ్చారు. ప్రతి పథకం కూడా పేద బడుగు బలహీన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్బంగా కేటీఆర్ అన్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం చేసే పనిని ఖచ్చితంగా ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు. నాటి సమైక్యరాష్ట్రంలో తెలంగాణ పల్లె ప్రగతి ఏవిధంగా ఉంది..నేడు ఏ విధంగా మారిందో కళ్లకుకట్టినట్టుగా వివరించారు. గవర్నర్ ధన్యావాద తీర్మానంకు మెజార్టీ సభ్యులు అమోదించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి…

మోదీ…గ్లోబల్ లీడర్ అప్రూవల్‌

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్ సభ

విశ్వనాథ్..కీర్తి అజరామరం: సీఎం కేసీఆర్

- Advertisement -