రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ గణేశుడి మండపానికి చేరుకున్నారు. శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో కొలువు దీరిన గణేశుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పోరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడికి, లడ్డూకి ఉన్న క్రేజే వేరు.కొన్ని లక్షల మంది భక్తులు ఆ మహాగణపతిని దర్శించుకుంటారు. చివరకు నిమజ్జన కార్యక్రమం కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. నిమజ్జనం తరువాత రెండు, మూడు రోజులకు ఆ గణపతి ప్రసాదమైన భారీ లడ్డూను అందరికీ పంచి పెడతారు. అయితే ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ ప్రసాదాన్ని ఈ సారి మాత్రం అందివ్వడం లేదట. ఎందుకంటే…గతేడాది లడ్డూ పంపిణీ వాటాలో ఉత్సవ కమిటీ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వివాదం తలెత్తింది. కాగా గణపతి లడ్డూని భక్తులకు పంచే క్రమంలో కూడా తీవ్ర సమస్యలు ఎదురవుతండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.