ఇవాళ రాజ్ భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు రానా, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టులో కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఘన స్వాగతం పలికారు.
కోవింద్ విడిది కోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో 4 రోజుల పాటు కోవింద్ విడిది చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 26న రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.