గవర్నర్ తేనీటి విందుకు హాజరైన ఇద్దరు చంద్రులు..

212
Governor
- Advertisement -

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్ర్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఇరు రాష్ర్టాల మంత్రులు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, కాంగ్రెస్ నేత జానారెడ్డి, తమిళనాడు  మాజీ గవర్నర్ రోశయ్య, , బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులతో పాటు ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులకు గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తేనీటి విందు కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు హాజరు కావడంతో గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.

Chandra

గవర్నర్ తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఇద్దరు సీఎంలతో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా కలిసి..ముగ్గురు ఛలోక్తు విసురుకుని నవ్వుకున్నారు. గవర్నర్ ఎట్‌హోం కార్యక్రమానికి  హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య  కేసీఆర్, చంద్రబాబుతో కాసేపు ముచ్చటించారు. పాత జ్ఞాపకాలను నేమరు వేసుకున్నారు.

Chandra

- Advertisement -