గవర్నర్ ఇఫ్తార్‌కు కేసీఆర్

199
Governor Hosts iftar party
- Advertisement -

రంజాన్ మాసం పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి,మహమూద్ అలీ,హరీష్‌ రావు,కడియంతో ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు,అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలని …తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా బతకాలని గవర్నర్ ఆకాంక్షించారు. చెడును వదిలేసి మంచిని స్వీకరించడమే రంజాన్ అని అందరం కలిసిమెలిసిగా ఉంటేనే శక్తిమంతంగా ఉంటామన్నారు. గవర్నర్ ఇఫ్తార్ సందర్భంగా రాజ్‌ భవన్‌ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

- Advertisement -