TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామా ఆమోదం..

22
- Advertisement -

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాజీనామా చేసిన కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామా నూ ఆమోదించారు గవర్నర్ తమిళి సై. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, పారదర్శక నియామకాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సందర్భంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్.

త్వరలో నూతన కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల సత్వర భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. ఈ దిశగానే ముఖ్యమంత్రి ఇప్పటికే చర్యలు ప్రారంభించారని చెప్పారు. Tspsc చైర్మన్, సభ్యుల రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

- Advertisement -